ముండ్లమూరులో పర్యటించిన ఏఎస్పీ శ్రీధర్ రావు
ముండ్లమూరులో శుక్రవారం ఎఎస్పీ శ్రీధర్ రావు పర్యటించారు. ఈ సందర్బంగా ముండ్లమూరులో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న తీరును స్థానిక ఎస్సై సంపత్ కుమార్ తో కలిసి ఎ. ఎస్. పి పరిశీలించారు. అనంతరం స్థానిక అధికారులతో మాట్లాడి పరీక్షలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఏఎస్పీ మాట్లాడుతూ... ఎస్పీ మలిక గర్గ్ ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద తగిన పోలీస్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.
