ముండ్లమూరు: కేజీబీవీని తనిఖీ చేసిన చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్
ముండ్లమూరు లోని కేజీబీవీని శనివారం చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ చల్ల మాధవి లత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేజీబీవీ లోని పదవ తరగతి విద్యార్థులతో ఆమె మాట్లాడారు. పరీక్షలకు సన్నదమవుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేజీబీవీ పరిసరాలను పరిశీలించారు. అలాగే విద్యార్థులకు అందిస్తున్న భోజన సదుపాయాలపై ఆరా తీసి పలు సూచనలు అందజేశారు.
