వైభవంగా రామాలయ విగ్రహ ప్రతిష్ట

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం లో ఆదివారం శ్రీ సీతారామస్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముండ్లమూరు మండల వైసీపీ నాయకులు మద్దిశెట్టి రవీంద్ర హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం మద్దిశెట్టి రవీంద్రనను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు.

వైభవంగా రామాలయ విగ్రహ ప్రతిష్ట