ముండ్లమూరు: రేపు ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష
స్థానిక ఆదర్శ మోడల్ స్కూల్ లో ఆరో తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కల్లూరి పూర్ణచంద్రరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ఈ పరీక్ష ప్రారంభం అవుతుందన్నారు. పరీక్షకు హాజరై విద్యార్థులు ఆన్లైన్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని తీసుకురావాలన్నారు. నిర్ణీత సమయంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు.
