పొగాకు రైతులని ఆదుకోవాలి.... జిల్లా కాంగ్రెస్ యువజన జనరల్ సెక్రెటరీ కైపు వెంకటకృష్ణారెడ్డి.....

కురిచేడులో పంటలను పరిశీలించిన..... జిల్లా కాంగ్రెస్ యువజన జనరల్ సెక్రెటరీ కైపు వెంకటకృష్ణారెడ్డి....
కురిచేడు మండలంలోని కాటంవారిపల్లె మరియు కురిచేడు గ్రామాలలో వేసిన పంట పొలాలని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కైపు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ మెట్ట పైరు వేసిన రైతులని ప్రభుత్వం ఆదుకోవాలని పొగాకు కంది మినిమం మిరప లాంటి పంటలో వేసిన రైతులు పెట్టుబడులకే డబ్బులు రావడం లేదని వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని దీనిని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గమనించి రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని సూచించారు. రైతులు పండించిన పంటలకి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాటం రమణారెడ్డి. కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు ప్రతాప్ ప్రతాప్. సుదర్శన్ రెడ్డి. వంశీ. తదితరులు పాల్గొన్నారు