త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రికత్త
త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ నందు ఉద్రికత్త నెలకొంది. ఒక కేసు విషయంలో గురువారెడ్డి అనే వ్యక్తిని స్టేషన్ కి పిలిచి ఎస్సై వెంకట సైదులు తీవ్రంగా కొట్టడంతో మనస్థాపానికి గురైన గురవారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. గురువారెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో వినుకొండ హాస్పిటల్ కు తరలించారు. బాధితుల బంధువులు ఎస్సై పై అగ్రహం వ్యక్తం చేస్తూ స్టేషన్ ను ముట్టడించారు
