జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లకు వినతులు అందించిన యూట్యూబ్ జర్నలిస్టులు

జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లకు వినతులు అందించిన యూట్యూబ్ జర్నలిస్టులు

జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జయ్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల యందు కలెక్టర్లకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నేపధ్యంలో గడచిన కొన్నేళ్లుగా జర్నలిజం పై మక్కువతో సమాజం పట్ల బాధ్యత తో నిష్ణాతులు అయిన జర్నలిస్టులు సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ అనేక వార్తలను ప్రసారాలు చేసినప్పటికీ ప్రభుత్వం ద్వారా జర్నలిస్టులకు అందాల్సిన సంక్షేమం అందటం లేదని పూర్తి అవగాహన తో వృత్తి నైపుణ్యాన్ని కలిగిన జర్నలిస్టులు రాష్ట్ర మంతటా ఒక్కటిగా ఏర్పడి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జయ్ యూనియన్ నెలకొల్పమని పూర్తి స్థాయిలో న్యూస్ ఛానెల్స్ రన్ చేయటానికి కావలసిన అనుమతులను పొందమని మాలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టు నకు ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సంక్షేమాలు అందించాలని వినతిపత్రం అందజేస్తూ ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో యూట్యూబ్ జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.