మాజీ ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం పలికిన బీజీపీ నాయకులు

మాజీ ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం పలికిన బిజెపి నాయకులు
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కి మంగళవారం కోడికొండ చెక్ పోస్ట్ వద్ద బిల్డింగ్ సెల్ స్టేట్ కన్వీనర్, జిల్లా ప్రోగ్రామ్ ఇంచార్జ్ గొడ్డన్ల వెంకటేష్ రాష్ట్ర ఓబీసీ ప్రధాన కార్యదర్శి పి.టి ఆంజనేయులు కిసాన్ మోర్చా జోనల్ ఇంచార్జ్ చంద్రశేఖర్ ఘన స్వాగతం పలికారు. అనంతపురం లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల పరిపాలన పై జరుగుతున్న బహిరంగ సభలో పాల్గొనటానికి బెంగళూరు నుండి అనంతపురం జిల్లా కేంద్రానికి వెళ్లుతున్న మాజీ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ని కొడికొండ చెక్పోస్ట్ వద్ద పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈసందర్బంగా రాష్ట్ర రాజకీయాలపై వారు వాకబు చేసినట్లు కిసాన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇంచార్జ్ చంద్రశేఖర్ తెలిపారు. రానున్నా ఎన్నికల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఇప్పటినుంచినే సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు.