దర్శి: ఆపద సమయంలో మహిళల రక్షణకు శక్తి టీమ్ ఏర్పాటు

ఈరోజు ప్రకాశం జిల్లా దర్శి సబ్ డివిజన్ పరిధిలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన శక్తి యాప్ మరియు శక్తి టీం, శక్తి బృందానికి ఇచ్చిన పెట్రోలింగ్ వాహనాలను దర్శి డీఎస్పీ బి లక్ష్మి నారాయణ లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళల చిన్నారుల భద్రత కోసం శక్తి టీం ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరు శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఉన్న ఆప్షన్స్ ద్వారా ఎవరికైనా ఎప్పుడైనా ఆపద సంభవిస్తే వెంటనే శక్తి యాప్ ద్వారా రక్షణ పొందవచ్చని, దర్శి సబ్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన శక్తి బృందంలో ఒక ఎస్ఐ ముగ్గురు మేల్ కానిస్టేబుల్స్ మరో ఇద్దరు ఉమెన్ కానిస్టేబుల్స్ అలాగే సబ్ డివిజన్ పరిధిలో ఉన్న మొత్తం వుమెన్ పిసి లందరూ కూడా సపోర్ట్ గా ఉంటారని, మహిళలు చిన్నారులు స్కూల్ కి వెళ్లే విద్యార్థులు అందరూ ఈ శక్తి యాప్ ని ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు.