దర్శి లో హోరెత్తిస్తున్న బీజేపీ శ్రేణులు

BSR NEWS, దర్శి.
మన భవిష్యయత్తుని తీర్చి దిద్దుదాం- తిండి నారాయణ రెడ్డి ఒంగోలు బీజేపీ అధ్యక్షులు
ప్రశ్నించే గళాన్ని గెలిపిద్దాం- దర్శి నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి మడపాకుల శ్రీను
దర్శి లో బీజీపీ శ్రేణులు వేగం పెంచాయి, దర్శి నియోజకవర్గ బీజీపీ ఇంచార్జి మరియు ఒంగోలు బీజీపీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో దర్శిలో ఇంటింటికీ తిరిగి విస్తృత ప్రచారాన్ని మొదలుపెట్టారు.
తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఓటరులను గుర్తించి వారిని వ్యక్తిగతంగా కలిసి ఆలోచించి ఓటు వేయాలని, ప్రశ్నించే గళాన్ని వినిపించాలని రాబోయే mlc ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతా ఓటుని సన్నారెడ్డి దయాకర్ రెడ్డి కి వేసి గెలిపించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.