కాలువలో దూకి యువకుడు ఆత్మహత్య
దర్శి నగర పంచాయితీలో పడమటి వీధికి చెందిన పసుపులేటి విజయ్ (30) అనే యువకుడు శుక్రవారం అర్ధరాత్రి నాగార్జున సాగర్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చివరిగా తమ్ముడికి ఫోన్ చేసి అమ్మ నాన్నను జాగ్రత్తగా చూసుకో అంటూ మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు విజయ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
