దర్శి లో మార్మోగుతున్న బాదం పేరు... మైండ్ గేమా లేక ముందు చూపా? |BSR న్యూస్|

దర్శి లో మార్మోగుతున్న బాదం పేరు... మైండ్ గేమా లేక ముందు చూపా? |BSR న్యూస్|

దర్శి లో రాజకీయాలు చాలా ఖరీదైనవి.  దర్శి లో ఓటర్లు కూడా తెలివైనవారు. దర్శి అసెంబ్లీ సీటు గెలవడం మాత్రమే గొప్ప కాదు ఇక్కడ ఏదైనా ప్రాంతీయ పార్టీ నుంచి అసెంబ్లీ టికెట్ సంపాదించడం కూడా చాలా ఖరీదైన విషయం.

ఇటీవల వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యం లో అనూహ్యంగా బాదం మాధవరెడ్డి కి పెరుగుతున్న ప్రజా ఆదరణ పట్ల BSR న్యూస్ స్పెషల్ ఫోకస్....

పక్కా  ప్రణాళికతో  బాదం పబ్లిసిటీ..

బాదం మాధవరెడ్డి దర్శి లో అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. మంచి మనసున్న వ్యక్తి పేద ప్రజల దాహాన్ని తీర్చిన గొప్ప దాత గా, మౌమిత ఫౌండేషన్ అధినేత గా ఆపద లో ఉన్న వారికి చేదోడు వాదోడు గా నిలిచి పేదల పెన్నిధి గా కొన్ని వేల మంది హృదయల్లో మంచి వ్యక్తిగా గతం లో పేరున్న వ్యక్తి బాదం మాధవరెడ్డి. 

అయితే అదంతా ఒకప్పుడు....

మరి ఇప్పుడు..

ఈ మధ్య కాలం లో అడపా దడపా అక్కడక్కడా దర్శి నియోజకవర్గ పరిధి లో జరుగుతున్న వివిధ శుభకార్యాల్లో బాదం హాజరు కావడం, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు తన అభిమానులతో సందడి వాతావరణం ఏర్పడుతుంది.

ఈ నేపధ్యం లో బాదం మాధవరెడ్డి ఈసారి  దర్శి టికెట్  ఆసిస్తున్నారనే విషయం ఆనోటా ఈనోటా దర్శి మొత్తం పాకిపోయింది. ఒక ప్రధాన పార్టీ నుండి టికెట్ పొందడం కోసం చర్చలు జరిపినట్లు, సరైన సమయం చూసుకుని దర్శి బరి లో దిగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మైండ్ గేమా?? ముందు చూపా??

అయితే, ప్రజలు వివిధ చోట్ల వివిధ రకాలుగా అనుకుంటున్నారు, ఇటీవల  ఒక గ్రామం లో జరిగిన తిరునాళ్ళ ప్రభ లలో సైతం బాదం ఫ్లెక్సి లు ఒక ప్రధాన పార్టీ కి చెందిన వారి తరపున కనిపించడం బాదం రాజకీయ ఎంట్రీ గురించి తీవ్ర చర్చలకు కారణం అయింది.

అయితే, బాదం మాధవరెడ్డి పొలిటికల్ ఎంట్రీ గురించి ఆయన ఇంతవరకు స్పందించలేదు. ఇప్పటికే దర్శి నియోజక వర్గం లోని 5 మండలాల్లో మాధవరెడ్డి సైన్యం పేరు తో వాట్సాప్ గ్రూప్ లు బాదం మాధవరెడ్డి రాక కి హింట్ ఇస్తున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ పూర్తి స్పష్టత లేదు...మరో వైపు సోషల్ మీడియా లో బాదం మాధవరెడ్డి పేరుతో ఆయన నాయకత్వానికి మద్దతు తెలుపుతున్నట్లు గా పోస్ట్స్ మాత్రం బాగా హల్చల్ చేస్తున్నాయి.. 

ఇంత జరుగుతున్నా కూడా బాదం మాధవరెడ్డి ఇంకా పై విషయంలో స్వయంగా ధ్రువీకరణ చేయకపోవడం చూస్తుంటే.. ఇది మైండ్ గేమా లేక, ముందు చూపు తో అన్ని వర్గాల వారిని కలుపుకొని వెళ్లడం కోసం పక్కా ప్రణాళిక నా అన్న విషయం పట్ల ఇంకా స్పష్టత లేదు. 

ఏది ఏమైనా బాదం మాధవరెడ్డి  దర్శి ఎమ్మెల్యే గా బరి లోకి దిగే విషయం మాత్రం ప్రజల్లో మంచి   ఆసక్తి ని రేకెత్తించే విషయమే...

అయితే ప్రజల్లో బాదం పట్ల మిశ్రమ స్పందన ఉంది, ఆయన  రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్తే బాగుంటుంది గానీ ఈ పరోక్ష విధానాల గందరగోళం ఏమంత ఉపయోగపడే అంశం కాదు అని కొందరు అభిమానూల అభిప్రాయం.

ఆలస్యం అమృతం విషం అని ఒక నానుడి ఉంది.. ఇప్పటికే అందరూ అనుకుంటున్నారు బాదం మాధవరెడ్డి ఈసారి ఎన్నికల బరి లో ఉన్నారని, ఇక ఆలస్యం చేయకుండా తరచుగా మీడియా లో కనిపించే విధంగా,ఇంటర్వ్యూ లు, డిజిటల్ మార్కెటింగ్ లాంటి మోడరన్ పొలిటికల్ స్ట్రాటజీ లను వాడుకుంటూ బాదం ఎంట్రీ ఉంటే బావుంటుంది అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ఆ వచ్చినప్పుడు చూద్దాం లే, అయినా అసలు టికెట్ రావాలి గా, టికెట్ రావాలి , ఆ తర్వాత ఆయన మండల స్థాయి నాయకుల్ని కలవాలి, ఊరికే సోషల్ మీడియా లో హల్చల్ చేసినంత మాత్రాన టికెట్ వచ్చేసి నట్లేనా, టికెట్ వచ్చినా లోకల్ నాయకుల సపోర్ట్ కూడా కావాలి గా అని కొందరి అభిప్ర్రాయం.   

 

www.bsrnews.in ఇదీ ప్రజల నాడి.... మరిన్ని ఆసక్తి కర వార్తల కోసం www.bsrnews.in మా వెబ్సైట్ ని వీక్షించండి.