ముండ్లమూరు :పోలీసుల అదుపులో 11మంది

ముండ్లమూరు మండలం తమ్మలూరు సమీపంలోని చిలకలేరు వద్ద ఆదివారం కోడిపందాలు ఆడుతున్న 11 మందిని ఎస్ఈబి సీఐ సుందరరామయ్య తన సిబ్బందితో వెళ్లి దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఆరు కోళ్లు, 10 కత్తులు, రూ.8460 నగదును స్వాధీనం చేసుకున్నామని సీఐ చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... జూదం ఆడుతుంటే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.

ముండ్లమూరు :పోలీసుల అదుపులో 11మంది