ఒక రోజు విజ్ఞాన,వినోద విహార యాత్ర కోసం MPPS మెయిన్ ముండ్లమూరు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు చెన్నయ్య,రాఘవ ఇతర సిబ్బంది కొత్తపట్నం బీచ్ లో సముద్ర స్నానం, ఒంగోలు రైల్వేస్టేషన్ బుకింగ్,రైళ్ల రాకపోకలు, ఎస్కలేటర్,లిఫ్ట్,జిల్లా కలెక్టర్ బంగ్లా, ఆఫీస్, ప్రకాశం భవన్,DEO ఆఫీస్,రిమ్స్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్,బ్లడ్ బ్యాంక్ కేంద్రం,అత్యవసర సేవా విభాగం,జిల్లా పోలీస్ కార్యాలయం (SP ఆఫీస్), గుండ్లకమ్మ ప్రాజెక్ట్ లను సందర్శించడం జరిగింది.కార్యక్రమంలో విద్యార్దులు ఎంతో ఉల్లాసంగా,ఉత్సాహంగా పాల్గొని ఎంతో ఆనందాన్ని,సంతోషాన్ని, విజ్ఞానాన్ని పొందారు.జిల్లా కేంద్రంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలన్నీ సందర్శించడం ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రత్యక్ష అనుభవంతో విజ్ఞానాన్ని,వినోదాన్ని పొందారు.అందరి సహకారంతో కార్యక్రమం విజయవంతం అయ్యింది.