ముండ్లమూరు: భారీ వర్షానికి కుప్పకూలిన పూరి పాక

ముండ్లమూరు బస్టాండ్ సెంటర్లో శనివారం కురిసిన భారీ వర్షానికి పోలేరమ్మ గుడి దగ్గర గల పూరిపాక కుప్పకూలింది. స్థానికుల సమాచారం మేరకు వర్షం పడుతున్న సమయంలో 6 మంది యువకులు పూరిపాకలోకి వెళ్లారని, ఉరుములు మెరుపులతో కూడిన భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం వలన కుప్పకూలిందని తెలిపారు. 6 మంది యువకులకు బయటికి రావడం వలన ఎవరికి ఎటువంటి గాయాలు జరగలేదని స్థానికులు తెలిపారు.

ముండ్లమూరు: భారీ వర్షానికి కుప్పకూలిన పూరి పాక