డ్రంక్ అండ్ డ్రైవ్ లో 5 రోజుల జైలు శిక్ష
మద్యం తాగి వాహనం నడిపినందుకు వాహనదారుడికి ఐదు రోజులు జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించినట్లు ఎస్సై సంపత్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ ల్లో పట్టుబడిన వ్యక్తిని శనివారం కోర్టులో హాజరుపరచగా జడ్జి శిక్ష విధించినట్లుగా పేర్కొన్నారు. మండలంలో మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.
