ముండ్లమూరు :108 వాహనంలో గర్భిణీ ప్రసవం
ముండ్లమూరు మండలం పూరిమెట్లకు చెందిన గర్భిణీ సరళకు ఆదివారం తెల్లవారు జామున పురిటి నొప్పులు వచ్చాయి. దీనితో కుటంబసభ్యులు 108 వాహన సిబ్బందికి సమాచారం అందించారు. వారు గ్రామానికి వెళ్లి గర్భిణీని వాహనములో అస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యములో సరళకు నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ వెంకట్రావు పైలట్ కోటయ్య తో కలిసి సుఖ ప్రసవం చేశారు. తల్లి బిడ్డ క్షేమంగా వున్నారని తెలిపారు.
