ఆంజనేయ స్వామి తిరునాలలో పాల్గొన్న జడ్పీ చైర్మన్
ముండ్లమూరులోని జమ్మలమడక గ్రామంలో ఆంజనేయ స్వామి తిరునాల కార్యక్రమం గురువారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దంపతులు పాల్గొని ఆంజనేయ స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఇరువురి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
