ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఏపిడి

ముండ్లమూరు మండలం సింగన్నపాలెంలో ఉపాధి హామీ పనులను ఏపిడి పద్మజ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూలీల సంఖ్యను పెంచి రోజు వారి రూ.250 గిట్టుబాటు అయ్యేలా పనులు కల్పించాలని అధికారులకు సూచించారు. పని ప్రదేశంలో తాగునీరు నీడ, ప్రధమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఏపిఓ కొండయ్య, టెక్నికల్ అసిస్టెంట్లు రూతమ్మ, సుధాకర్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఏపిడి