ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం రజానగరం పరిసర గ్రామాల్లోని స్థానిక ఎంఈఓ సుబ్బయ్య పాఠశాలలను సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలకు వచ్చిన వేరుశెనగ చిక్కిలను ఆయన పరిశీలించారు. కొన్ని పాఠశాలలలో కాలం చెల్లినవి ఉన్నట్లు గుర్తించి వాటిని ఉపయోగించవద్దని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.