తాళ్లూరులో నేలకొరిగిన అరటి తోటలు
తాళ్లూరు మండలంలో ఆదివారం ఈదురు గాలులు ఉరుములతో వడగండ్ల వాన కురిసింది.ఈ అకాల వర్షం రైతాంగానికి నష్టాన్ని మిగిల్చింది.కొత్తపాలెం వద్ద కోట సుబ్బారెడ్డికి చెందిన మూడు ఎకరాల కాపుకు వచ్చిన అరటి తోట నేలకూలి రూ.3 లక్షల మేరకు నష్టం జరిగిందని బాధ్యత రైతు తెలిపారు. వడగళ్ళు పెద్ద సైజులో పడగా ప్రజలు ఇళ్లల్లో నుండి బయటకు వచ్చేందుకు భయాందోళన చెందారు.
