పేకాట స్థావరంపై పోలీసులు దాడి
పేకాట స్థావరంపై దాడి చేసి ముగ్గురు పేకాట రాయుళ్లను అరెస్టు చేసినట్లు బి ప్రేమ్ కుమార్ తెలిపారు. గుంటి గంగ ఆలయ సమీపంలోని అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం తెలియడంతో సిబ్బందితో వెళ్లి పేకాట స్థావరంపై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ 1.04.780 స్వాధీనం చేసుకొని 11 బైకులు సీజ్ చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి కోర్టుకు హాజరపరచనున్నట్లు చెప్పారు. ఎస్సై వెంట కానిస్టేబుల్ బ్రహ్మనాయుడు హెచ్ జి శ్రీను ఉన్నారు.
