తాళ్లూరు :బోల్తా పడ్డ మినీ లారీ
తాళ్లూరు మండలం దోసకాయలపాడు వద్ద ఆదివారం బియ్యం తీసుకెళ్తున్న ఓ మినీ లారీ బోల్తా పడింది. స్థానికుల కథనం ప్రకారం తూర్పు గంగవరంలో ప్రజా పంపిణీ కోసం లారీలో బియ్యం బస్తాలను తీసుకొని ముండ్లమూరుకు వెళ్తుండగా దోసకాయలు పాడు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.
