నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా విస్తృత అవగాహన కార్యక్రమాల నిర్వహణ...

కర్నూలు రేంజ్ DIG శ్రీ కోయ. ప్రవీణ్ IPS గారి ఆదేశాలమేరకు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS గారి సూచనలతో ప్రతి శనివారం జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జిల్లా పోలీస్ అధికారులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు వారి వారి పోలీస్ స్టేషన్ ల పరిధిలో స్కూళ్ళు మరియు కాలేజీలలో విద్యార్థినీ, విద్యార్థులకు ముఖ్యమైన కూడళ్ళులో యువతకు, ఆటో, లారీ డ్రైవర్లకు, ప్రజలకు, ద్విచక్ర వాహన దారులకు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్బంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ ద్విచక్ర వాహనంపై హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయరాదని, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యం సేవించి, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, పరిమితికి మించి వాహనాలలో ప్రజలను లేదా ఇతర సరుకులను రవాణా చేయడం వంటి రోడ్డు భద్రత,ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగి గాయాలపాలు అవ్వడమే కాకుండా చనిపోయే ప్రమాదం ఉంది. తద్వారా మీరు మీ కుటుంబం నష్టపోవడమే కాకుండా ఇతర కుటుంబాల వారిని కూడా తీరని నష్టం లోటు ఏర్పడే అవకాశం ఉంది. కావున వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యం చేరాలని అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది. ముఖ్యంగా వేసవికాలంలో సెలవుల కారణంగా మైనర్ల వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. కావున తల్లిదండ్రులు వారిపై నిఘా ఉంచి మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు.