కిషోరి వికాసం కోసం ప్రత్యేక తరగతులు BSR NEWS

పూతలపట్టు మండలం.ఎర్ర చెరువు పల్లి పంచాయితీ. ఎర్ర చెరువుపల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రమునందు కిషోరి వికాసం సమ్మర్ స్పెషల్ క్యాంపెయిన్ వర్క్ షాప్ ఐరాల ప్రాజెక్టు సి.డి.పి.ఓ. జి. నిర్మల ఆధ్వర్యంలో జరిగింది. మే 2 తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు ఈ కార్యక్రమము జరుగుతుంది. యుక్త వయస్సు బాలికలకు పరిశుభ్రత,లింగ వివక్షత బూతుక్రమము. హక్కులు, రక్షణ, విద్యా ,కెరియర్ మరియు బాల్య వివాహాలు మొదలైన వాటిపైన గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు క్యాలెండర్ లో సూచించిన తేదీల్లో నిర్వహించాలని కోరడమైనది. ఈ కార్యక్రమానికి ఏ సి డి ఎస్ సూపర్వైజర్ ఐ. భారతి, సర్పంచ్ పి. హరిప్రియ ఏ.ఎన్.ఎం దేవి. రాశి ఆశా వర్కర్, శిల్ప, టి.అరుణ స్కూల్ చైర్మన్ టి .శ్రావణి అంగన్వాడి టీచర్ జి.వనజ మరియు కిషోర్ బాలికలు హాజరైనారు.