డిసెంబరు 3 నాటికి కులగణన సర్వే పూర్తి BSR NESW

డిసెంబరు 3 నాటికి కులగణన సర్వే పూర్తి
AP: రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి చేపట్టనున్న కులగణన వారం రోజుల్లోనే పూర్తి కానుంది. DEC 3 నాటికి సర్వే పూర్తి చేయాలని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు అందాయి. కులగణన సర్వే వివరాల నమోదుకు వాలంటీర్ల సెల్ఫోన్లో ప్రత్యేక యాప్ను పొందుపరిచారు. ఈ సర్వేలో భాగంగా వాలంటీర్లు, సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 20కి పైగా అంశాలపై సమాచారం సేకరిస్తారు. కులగణన ఖర్చులకు ప్రభుత్వం రూ.10.19 కోట్లు కేటాయించింది.