కాణిపాకం: గోశాలకు ఆవుల వితరణ BSR NESW

కాణిపాకం: గోశాలకు ఆవుల వితరణ
కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం గోశాలకు పారిశ్రామికవేత్త గల్లా రామచంద్ర నాయుడు, గల్లా అరుణ కుమారి తరఫున బాలకృష్ణ రెడ్డి రెండు ఆవులను బుధవారం వితరణగా అందజేశారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. ఆలయ ఛైర్మన్ మోహన్ రెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.