దర్శి: అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన గొట్టిపాటి లక్ష్మీ

దర్శి: ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారిని కలిసిన ప్రింట్ & ఎలెక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
స్థలాలను పరిశీలించాలని రెవిన్యూ డిపార్ట్మెంట్ ను కోరిన లక్ష్మీ
BSR NEWS - DARSI
తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీను దర్శి మీడియా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డాక్టర్ లక్ష్మీ గారిని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన డాక్టర్ లక్ష్మి జర్నలిస్టుల ఇళ్లస్థలాల విషయంపై రెవెన్యూ అధికారులతో చర్చించారు. స్థానిక ఎమ్మార్వో శ్రావణ్ కుమార్ తో మాట్లాడి వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. మనం ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తామని డాక్టర్ లక్ష్మి హామీ ఇచ్చారు. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వ స్థలాలను పరిశీలించాలని రెవెన్యూ అధికారులను డాక్టర్ లక్ష్మీ కోరారు. త్వరితగతిన ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చిన నేను ముందుంటానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జర్నలిస్టులందరూ డాక్టర్ లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ లక్ష్మిను కలిసిన వారిలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.