యువత పోరు కాదు.... వైసిపి పార్టీ ఉనికి పోరు. దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

DARSI - BSR NEWS: వైసిపి పార్టీ మనుగడ కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పై యువత పోరు పేరుతో పార్టీ ఉనికికి ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, డీఎస్సీ పేరుతో ధర్నాలు చేసే అర్హత లేదని దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులకు చెల్లించాల్సిన 4,271 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసి ఇప్పుడు బకాయిల పై తానే ఆందోళనలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసిపి నాయకులు ఫీజు రీయింబర్స్మెంట్ పై ఆందోళనకు పిలుపునివ్వడం చూస్తుంటే దొంగే దొంగ అని అరచినట్టుందని అన్నారు. గుడ్లు 200 కోట్లు, చిక్కి 60 కోట్లు కూడా చెల్లించకుండా మోసం చేసింది వైసిపి నే అన్నారు. ఇటీవలే మంత్రి నారా లోకేష్ గారు 788 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేసిందని, pg విద్యార్థులకు కూడా తిరిగి ఫీరీయింబర్స్మెంట్ ప్రారంభించేలా నారా లోకేష్ గారు ఆలోచన చేయటం శుభదాయకం, వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ఏటా డీఎస్సీ ఇస్తాం అని చెప్పి 5 ఏళ్లు ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా దగా చేసిందని వైసిపి నాయకుల మాటలు విద్యార్థులు యువకులు వినే పరిస్థితి లేదని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు.