పెన్షన్ల సృష్టి కర్త.. శ్రీ దామోదరం సంజీవయ్య... గోవింద ప్రసాద్ మాదిగ

తొలి దశలో ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ఉన్న దామోదర్ సంజీవయ్య గారు నేడు అనుభవిస్తున్న టీచర్స్ గాని వృద్దుల గాని వారి పెన్షన్లను సృష్టించిన మహోన్నత వ్యక్తి దామోదర్ సంజీవయ్య అని నవ్యాంధ్రమాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవ లకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ పేర్కొన్నాడు. దర్శి మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి గోళ్ల పాటి సుధారాణి అచ్చయ్య అధ్యక్షతన జరిగిన దామోదర సంజీవయ్య 104వ జయంతి కార్యక్రమములో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కవల కుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెదపాడు గ్రామంలో 14 ఫిబ్రవరి 1942 సంవత్సరమున జన్మించినారన్నారు. ఈయన సామాన్య వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించిన వ్యక్తి. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అవినీతిని అరికట్టేందుకు ఏసీబీ వ్యవస్థను తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అన్నారు. దళితుల కోసం వేల ఎకరాలు భూ పంపిణీ చేసిన ముఖ్యమంత్రిగా ఆయనకు ఖ్యాతి ఉంది. కాపు కులాన్ని బీసీల జాబితా నుండి తొలగిస్తే వారిని తిరిగి బీసీల్లో చేర్చిన ఘనత దామోదరం సంజీవయ్యకే దక్కుతుందన్నారు. మండల్ కమిషన్ కు ముందే బీసీ కులాలకు రిజర్వేషన్లు అమలు చేసిన మహోన్న త వ్యక్తి దామోదరం సంజీవయ్య అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ. ఎస్టి. బిసి మైనార్టీ లందరూ దామోదరం సంజీవయ్య చూపిన బాటలో నడవాలని బహుజనులు రాజ్యాధికారం పొందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గర్నెపూడి ప్రేమ్ కుమార్. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రాచపూడి కరుణానిధి. దళిత నాయకులు గొల్లపాటి అచ్చయ్య. మురికిపూడి ప్రభాకర్. దంతులూరి కోటేశు. పలువురు దళిత నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...