తాళ్లూరు లో పరిటాల సురేష్ ప్రచారం

తాళ్లూరు మండలం, తూర్పు గంగవరం లో, టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్, స్కూల్స్ కు వెళ్లి, వచ్చే 13 తేదీనా జరగబోయే mlc గ్రాడ్యుటే ఎన్నికలలో మొదట ప్రాధాన్యత ఓటు యువకుడు, విజ్ఞాన వంతుడు కంచర్ల శ్రీకాంత్ కు వేసి గెలిపించాలని కోరారు. చట్ట సభల్లో యువకులు కోసం పోరాడే వ్యక్తి శ్రీకాంత్ అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం యువతను మోసగించింది అని అన్నారు. అందరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగు పడాలి అంటే శ్రీకాంత్ గెలుపే ముఖ్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో రమణా రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సుబ్బారావు మొదలగు వారు పాల్గోన్నారు.