మహిళ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి - డిబిఆర్సి రాష్ట్ర మహిళా ట్రైనింగ్ కో-ఆర్డినేటర్, ఎం.హేమలత

ముండ్లమూరు తేదీ19-02-25
మహిళల రక్షణ చట్టాలు, హక్కుల గురించి మరియు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడం గురించి దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఏరియా కోఆర్డినేటర్ తప్పెట డేవిడ్ అధ్యక్షతన ముండ్లమూరు మండల పరిషత్ కార్యాలయం నందు ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డిబిఆర్సి రాష్ట్ర మహిళ ట్రైనింగ్ కో-ఆర్డినేటర్ ఎం హేమలత మాట్లాడుతూ బాల్యంలో ఆడబిడ్డలకు వివాహాలు చేయరాదని . ప్రతి మహిళ తల్లిగా, భార్యగా, బిడ్డగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న మన దేశం లో ఆడపిల్లలను రక్షించుకునేందుకు నేటికీ చట్టాల మీద ఆధారపడవలసి రావడం దురదృష్టకరమని అన్నారు. నేటి సమాజ అభివృద్ధిలో స్త్రీ పాత్ర ఎంతో ప్రముఖమైనదని ఆమె కొనియాడారు, మండల వెలుగు కమ్యూనిటీ కో-ఆర్డినేటర్ కె. కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి మహిళా అబివృద్ది ద్వారా వారి యొక్క జీవన ప్రమాణాలు పెంచుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందినప్పుడే మన కుటుంబాలు సమాజం అభ్యర్థి చెందుతుంది ఆయన తెలియజేశారు. మండలమూరు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి టీ.శాంతి ప్రియ మాట్లాడుతూ బాల్య వివాహాల నిరోధక చట్టం గురించి మరియు గృహహింస వ్యతిరేక చట్టం మహిళలు ఆరోగ్య భద్రత శ్రేయస్సుకు హాని కలిగించటం మహిళలను శారీరకంగా మానసికంగా బాధించడం. వరకట్నం కోసం డిమాండ్ చేయడం లైంగిక వేధింపులకు గురి చేయటం, అశ్లీల విషయాలను చూడడానికి బలవంతం చేయటం, మగ పిల్లలను కనాలని చెప్పటం నేరమని ఆమె తెలియజేశారు. డిబిఆర్సి రీజియన్ కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ సమాజాభివృద్ధిని ఆ సమాజంలో మహిళల అభివృద్ధితో లెక్కిస్తానని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్న మాటలను గుర్తు చేశారు. మహిళలు లేని సమాజాన్ని ఊహించడం సాధ్యం కాదని అన్నారు. అలాంటి ఈ సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్షత హేయం అన్నారు ఆడబిడ్డ పెళ్లి కోసం కాదు చదువు కోసం అని ప్రతి తల్లిదండ్రి గుర్తుతెరగాలని అన్నారు. సమాజంలో మహిళల పట్ల లైంగిక వేధింపులు పరిపాటిగా మారాయని వీటిని నివారించేందుకు ఉన్న చట్టాలను మహిళలు అవగాహన కలిగి సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో మండలo లోని వివిధ గ్రామాల నుండి వచ్చిన మహిళలు పాల్గొన్నారు.