ముండ్లమూరు:విద్యుత్ సిబ్బందిపై దాడి.. కేసు నమోదు
విద్యుత్తు సిబ్బందిపై దాడికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సంపత్ కుమార్ బుధవారం తెలిపారు. ముండ్లమూరు మండలంలోని భీమవరంలో విధినిర్వహణలో ఉన్న సిబ్బంది కూడలి నవీన్, దత్తులపై ఎస్టి కాలనీకి చెందిన గద్దల దావీదు, అక్కమ్మలు దాడి చేసి రీడింగ్ మీటర్, సెల్ ఫోన్ ధ్వంసం చేయడంతో పాటు వారిపై దాడి చేసి గాయపరిచారు. విద్యుత్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
