ముండ్లమూరు : ఫ్యామిలీ ఫిజీషియన్ పేదలకు వరం
పెదరావిపాడు గ్రామంలో శుక్రవారం హెల్త్ క్లినిక్ దగ్గర ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరంను వైద్యాధికారి మధు శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పటల్ కు దీటుగా అధునాతన పరికరాలతో వైద్య సేవలు గ్రామీణ ప్రజలకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరంలో 164 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమగు వారికి మందులు పంపిణీ చేశారు.
