APHIGHCOURT

వాలంటీర్లకు ఆ అధికారం ఎక్కడిది - రెగ్యులరైజ్ చేస్తారా : ఏపీ హైకోర్టు..!? ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పలు ప్రశ్నలు సంధించింది. వాలంటీర్ల నియామకానికి తాము వ్యతిరేకం కాదని పేర్కొంది. చట్టం అనుమతిస్తే వారిని శాశ్వత ఉద్యోగులుగా మార్చాలని సూచించింది. లబ్దిదారుల గుర్తింపులో వాలంటీర్ల పాత్రనైనే తమకు అభ్యంతం ఉందని పేర్కొంది. సంక్షేమ పథకాల అర్హుల ఎంపికను వాలంటీర్లకు ఎలా అప్పగిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజాల సమాచారన్ని యాప్ లలో అప్ లోడ్ చేయటం గోప్యతకు భంగం కాదా అంటూ సెర్ఫ్ సీఈవోను హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.నిర్ణయించే బాధ్యతలు ఎలా నిర్వహిస్తారు.వాలంటీర్లు సంక్షేమ పథకాల ఎంపిక..వారి అర్హతలను నిర్ణయించే బాధ్యతలు ఎలా నిర్వహిస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అధికారులు ఉండగా.. వాలంటీర్లు ఆ బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించింది. ప్రజల సమాచారాన్ని యాప్ లలో పొందుపరిచే అధికారం వాలంటీర్లకు ఎవరు ఇచ్చారని కోర్టు సీరియస్ అయింది. ఆధార్ తో పాటుగా వ్యక్తిగత వివరాలను యాప్ లో పొందు పరిస్తే వ్యక్తిగత గోప్యత పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేసింది. సామాజిక సేవ కోసం వాలంటీర్లను నియమిస్తే..వారికి పథకాల లబ్దిదారుల వివరాల సేకరణ..అర్హతలను నిర్ణయించే అధికారాన్ని ఎలా అప్పగిస్తారని సెర్ప్‌ సీఈవో ఏఎండీ ఇంతియాజ్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది.వాలంటీర్ల నియామకానికి వ్యతిరేకం కాదు.వాలంటీర్ల నియామకాలకు తాము వ్యతిరేకం కాదని కోర్టు స్పష్టం చేసింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులే ఈ సమాచారం సేకరించే వారు కదా అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. రాజకీయ కారణాలతో తమను జాబితా నుంచి తొలగించారని, గారపాడుకు చెందిన 26 మంది లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు వలంటీర్లకు జవాబుదారీతనం ఏముంటుందని ప్రశ్నించింది. సంక్షేమ పథకాలకు మేం వ్యతిరేకం కాదని, వాటి అమలుకు ఎంచుకున్న విధానమే చట్టవిరుద్దమైనదని హైకోర్టు పేర్కొంది. సంక్షేమ పథకాలకు మేం వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. చట్టం అనుమతిస్తే వాలంటీర్ల సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని కోర్టు సూచించింది.సెర్ఫ్ సీఈవో వాలంటీర్ల పాత్ర పైన వివరించారు.వాలంటీర్ల నియామకానికి వ్యతిరేకం కాదు వాలంటీర్ల నియామకాలకు తాము వ్యతిరేకం కాదని కోర్టు స్పష్టం చేసింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులే ఈ సమాచారం సేకరించే వారు కదా అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. రాజకీయ కారణాలతో తమను జాబితా నుంచి తొలగించారని, గారపాడుకు చెందిన 26 మంది లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు వలంటీర్లకు జవాబుదారీతనం ఏముంటుందని ప్రశ్నించింది. సంక్షేమ పథకాలకు మేం వ్యతిరేకం కాదని, వాటి అమలుకు ఎంచుకున్న విధానమే చట్టవిరుద్దమైనదని హైకోర్టు పేర్కొంది. సంక్షేమ పథకాలకు మేం వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. చట్టం అనుమతిస్తే వాలంటీర్ల సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని కోర్టు సూచించింది.సెర్ఫ్ సీఈవో వాలంటీర్ల పాత్ర పైన వివరించారు.

APHIGHCOURT
APHIGHCOURT
APHIGHCOURT
APHIGHCOURT