హాంగ్కాంగ్ మోడల్ దారుణ హత్య.. వీడిన మిస్టరీ

హాంగ్కాంగ్ మోడల్ దారుణ హత్య.. వీడిన మిస్టరీ
హాంగ్కాంగ్ ల్ కు చెందిన 28 ఏళ్ల మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అబ్బీ చోయ్ ఇటీవల దారుణ హత్యకు గురైంది. తాజాగా పోలీసులు ఈ మర్డర్ మిస్టరీని ఛేదించారు. ఆమె మాజీ భర్త కుటుంబ సభ్యులు అత్యంత దారుణంగా ఆమెను హతమార్చినట్టు గుర్తించారు. ఆమె పుర్రెను, పక్కటెముకలను సూప్ తయారు చేసే ఓ పెద్ద పాత్రలో గుర్తించగా.. మూడు రోజుల తర్వాత ఆమె రెండు కాళ్లను ఓ మాంసం కొట్టులోని ఫ్రిజ్ లో గుర్తించారు.