చంద్ర‌బాబును క‌లిసిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ వీహెచ్‌

చంద్ర‌బాబును క‌లిసిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ వీహెచ్‌
  • విజ‌య‌వాడ‌లో చంద్ర‌బాబుతో వీహెచ్ భేటీ
  • ఏపీలోని ఒక జిల్లాకు దివంగ‌త నేత‌ దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని విన‌తి
  • ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారన్న హన్మంతరావు

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. విజయవాడలో ఆయనను కలిసిన వీహెచ్ ఏపీలోని ఒక జిల్లాకు నాటి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం, దివంగత నేత‌ దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని, స్మృతివనం నిర్మించాలని కోరారు. ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారని ఆయ‌న తెలిపారు. దళిత ముఖ్య‌మంత్రి అయిన సంజీవయ్య అత్యంత నిజాయితీపరుడని వీహెచ్ కొనియాడారు.