స్వామి వారి రెండవ వార్షికోత్సవ వేడుకలు.
మండల కేంద్రమైన ముండ్లమూరులోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం రెండో వార్షికోత్సవ వేడుకలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. వార్షికోత్సవ సందర్బంగా స్వామివారిని ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే భక్తులకి అన్నధాన కార్యక్రమం నిర్వహించారు.
