ఈదరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తాం
ముండ్లమూరు మండల విద్యార్థుల సౌలభ్యం కోసం వినుకొండ డిఎంతో మాట్లాడి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని అద్దంకి ఆర్టీసీ డి పో మేనేజర్ మోహనరావు తెలిపారు. ముండ్లమూరు నుండి ఈదర పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తగు చర్యకు శ్రీకారం చుట్టామన్నారు. కాగా ప్రయాణికులు సైతం ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఆర్టీసీ సంస్థను పరిరక్షించాలన్నారు.
