జీడిమెట్ల లోని ఓ కంపెనీ లో రియాక్టర్ పేలి ఇద్దరు మృతి

జీడిమెట్ల లోని ఓ కంపెనీ లో రియాక్టర్ పేలి ఇద్దరు మృతి

రియాక్టర్ పేలి ఇద్దరు మృతి

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జీడిమెట్లలోని ఆరోరా ఫార్మాసూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. కెమికల్ ల్యాబ్లో పని చేస్తున్నప్పుడు రియాక్టర్ పేలి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. జీడిమెట్ల ల్యాబ్లో పనిచేస్తున్న రవీందర్ రెడ్డి(25), కుమార్ (24) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. జీడిమెట్ల ఫైర్ డిపార్ట్మెంట్ వారు దర్యాప్తు చేస్తున్నారు.