మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ
బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీని ప్రారంభించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా త్వరలో మహారాష్ట్రలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈమేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాల్క సుమన్, జోగు రామన్న, గోడం నగేశ్ లతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. మహారాష్ట్రలో ఎన్నికలు జరిగే జిల్లాల ఇన్ ఛార్జిలుగా వారిని నియమించారు.