కాకినాడ: మహిళ ప్రాణాన్ని కాపాడిన మహిళా ఎస్సై

కాకినాడ: మహిళ ప్రాణాన్ని కాపాడిన మహిళా ఎస్సై

కాకినాడ రూరల్ రామేశ్వరానికి చెందిన ఒక మహిళ జగన్నాధపురం వంతెన పైనుంచి దూకే ప్రయత్నం చేసింది.అదే సమయానికి అక్కడ విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ASI శ్రీమతి కుమారి బేబీ అది చూసి అక్కడే ఉన్న ఇద్దరు కానిస్టేబుల్ తో కలిసి ఆమెను కాపాడారు.కాపాడబడిన మహిళ కాకినాడ రూరల్ రామేశ్వరానికి చెందిన శ్రీమతి దూళ్ళ సుందరం అని, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అందువల్ల చనిపోదామనుకొని ఈ పని చేశాను అని చెప్పగా, ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు.ఈ విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్.,గారు మహిళ ప్రాణాన్ని కాపాడిన ట్రాఫిక్ ASI శ్రీమతి కుమారి బేబీనీ, ఇద్దరు కానిస్టేబుల్ లను అభినందించారు.