ఏపీ లో రేపే టెన్త్ ఫలితాల విడుదల - BSR న్యూస్.

ఏపీ లో రేపే టెన్త్ ఫలితాల విడుదల - BSR న్యూస్.

ఏపీలో రేపే టెన్త్ ఫలితాల విడుదల  

 

▪️ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల ఎప్పుడనే ఉత్కంఠకు తెరపడింది. 

 

▪️ఫలితాల విడుదల తేదీని మంత్రి బొత్స సత్యనారాయణ స్వయంగా ప్రకటించారు. 

 

▪️రేపు అంటే ఈ నెల 6వ తేదీ ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

 

▪️ఈ రోజు ఉపాధ్యాయ సంఘాల నేతలతో జరిగిన చర్చల సందర్భంగా మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. ఈ మేరకు విద్యాశాఖ సైతం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. 

 

▪️రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఫలితాల విడుదల తర్వాత విద్యార్థులు  https://www.bse.ap.gov.in/  లింక్ ద్వారా తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

 

▪️ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 18వ తేదీన టెన్త్ ఎగ్జామ్స్ ముగిశాయి. ఈ నేపథ్యంలో రిజల్ట్స్ ఎప్పుడు విడుదలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

 

▪️ఏపీ టెన్త్ రిజల్ట్స్ ను మే రెండో వారంలో విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి గతంలో ప్రకటించారు. 

 

▪️ఏప్రిల్‌ 19 నుంచి 26వ తేదీ వరకు 8 రోజుల పాటు రాష్ట్రంలోని 23 జిల్లాల్లో స్పాట్‌ వాల్యుయేషన్ సైతం నిర్వహించారు.

 

▪️30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు ఈ స్పాట్ వాల్యుయేషన్ ను విజయవంతంగా నిర్వహించారు.

 

▪️ప్రస్తుతం ఇందుకు సంబంధించిన మార్కుల టేబులేషన్ ప్రక్రియ సాగుతోంది. అయితే.. పరీక్షలు ముగిసిన 20 రోజుల్లోపే వాల్యుయేషన్, టేబులేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను విడుదల చేసి మరో సంచలానికి ఏపీ విద్యాశాఖ సిద్ధం అవుతోంది.