లోకేష్ ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకోవాలి- గౌస్ మోహిద్దీన్
లోకేష్ ఉత్తర కుమార ప్రఘల్బాలు మానుకోవాలి !
వైసిపి ముస్లిం మైనారిటీ సీనియర్ నాయకుడు షేక్ గౌస్ మొహిద్దిన్ !
టిడిపి అధికారంలోకి వస్తే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామంటూ,మైనారిటీలను రాజకీయంగా,ఆర్థికంగా అభివృద్ధి చేస్తామంటూ టీడీపి నాయకుడు లోకేష్ లోకేష్ చెప్పడం చూస్తే ఉత్తర కుమార ప్రఘల్బాలు గుర్తుకొస్తున్నాయి. పై పెచ్చు ఈయన డిప్యూటీ సిఎం అంజాద్ బాషా గారిని బహిరంగ చర్చకు రావాలంటూ ఛాలెంజ్ చేయడం హాస్యాస్పదంగా ఉంది.మీ మాటలు మాటలే తప్ప చేతలు కావు అనేది మీ టిడిపి ప్రభుత్వంలో రుజువయ్యింది.మీ ప్రభుత్వంలో ఒక మంత్రిగా మైనారిటీ పనికిరాలేదు,కనీసం ఒక ఎమ్మెల్యేగా కూడా మైనారిటీని ఉంచని మీరు ఇవాళ మైనారిటీలను ఉద్దరిస్తామంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. హిందూపురంలో మీ మామ బాలకృష్ణ సీటు కోసం ఒక సిట్టింగ్ మైనారిటీ ఎమ్మెల్యేకి అన్యాయం చేసిన విషయం అందరికి తెలుసు. కడపలో తన స్వంత మేనమామను సైతం కాదని అంజాద్ బాషా గారికి సీటు ఇచ్చి, గెలిపించడమే కాకుండా డిప్యూటీ సీఎం ను చేసిన చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని తెలియజేస్తున్నాం !
మేము ఇవ్వాళ అడుగుతున్నాము మీ హయాంలో ఎంత మంది మైనారిటీలకు రాజకీయంగా మేలు జరిగింది. ఎంత మందికి ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చారు బహిరంగ చర్చకు సిద్ధమా అని అడుగుతున్నాం !
మీకు ఓట్ల కోసం మైనారిటీ లు కావాలి,ఎన్నికలప్పుడు మాత్రమే మైనారిటీలు గుర్తుకొస్తారు అనేది అందరికీ తెలుసు ! చిత్తశుద్ధితో మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మేసిన చందంగా ఉంటుందని..మీ మాటలు నమ్మి మోసపోవద్దని మైనారిటీలు ఎవరూ సిద్ధంగా లేరని లోకేష్ కు తెలియజేస్తున్నాం ! అని గౌస్ మోహిద్దీన్ విరుచుకుపడ్డారు.