Travels Bus | పేలిన టైరు.. సూర్యాపేటలో ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

Travels Bus | పేలిన టైరు.. సూర్యాపేటలో ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

సూర్యాపేట జిల్లా మోతె వద్ద పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు (Travels Bus) టైరు పేలడంతో మంటలు చెలరేగాయి. శుక్రవారం తెల్లవారుజామున మోతె సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు టైరు పేలిపోయింది.

సూర్యాపేట జిల్లా మోతె వద్ద పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు (Travels Bus) టైరు పేలడంతో మంటలు చెలరేగాయి. శుక్రవారం తెల్లవారుజామున మోతె సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు టైరు పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును నిలిపివేశాడు. క్రమంగా మంటలు విస్తరించడంతో బస్సు దగ్ధమైంది. అయితే అందులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.