విఠలాపురం సర్పంచ్ కు షోకాజ్ నోటీసులు.

తాళ్లూరు మండలం విఠలాపురం గ్రామ సర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డికి జిల్లా పంచాయతీ అధికారి నారాయణరెడ్డి షోకాజ్ నోటీసులు సోమవారం జారీ చేశారు. ఉపాధి పనికి సంబంధించిన బిల్లు నగదును స్వాహా చేసినందుకు గాను నోటీసులు జారీ అయ్యాయి. ఎంపీపీ స్కూల్ ప్రహరీ గోడను ఉపాధి నిధులతో నిర్మించిన కాంట్రాక్టర్ విద్యాసాగర్ కు రూ 3.86 లక్షల ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఆ నగదును సర్పంచ్ చెల్లించలేదని విచారణలో తేలింది.

విఠలాపురం సర్పంచ్ కు షోకాజ్ నోటీసులు.