తాళ్లూరు: ఈ ఎంపీడీవో మాకొద్దు.
ఎంపీడీవో మాకొద్దు అంటూ తాళ్లూరుకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు శనివారం ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక జడ్పిటిసి మారం వెంకారెడ్డి ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావులు మాట్లాడుతూ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎంపీడీవో ప్రజాప్రతినిధులు అంటే లెక్క లేకుండా చులకనగా చూస్తున్నారన్నారు.ఉపాధిహామీ పనుల్లో అవకతవకాలు జరుగుతున్నాయని అన్నారు.
