చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం బెల్లంకొండ వారి పాలెం గ్రామంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన మంచినీరు చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్ పోశం సుమలత శుక్రవారంప్రారంభించారు. ప్రజల దాహార్తిని తీర్చడానికి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సరస్వతి, వాలంటీర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
