ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, IPS ., గారి సూచనల మేరకు DSP టి . అశోక్ వర్ధన్ గారు ,తాళ్ళూరు పోలీస్ స్టేషన్ ను సందర్శించి స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు డైరీలను, రిజిష్టర్ లను పరిశీలించి, రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని చెక్ చేసి పోలీస్ స్టేషన్లో సిబ్బంది యొక్క పనితీరును తెలుసుకున్నారు.
పోలీస్ స్టేషన్ లో పెండ్డింగ్ కేసులు అన్ని పూర్తి చెయ్యాలి అని సూచించారు .స్టేషన్ రికార్డ్స్ తనిఖీ చేసి పెండ్డింగ్ కేసులను త్వరగా విచారణ జరిపి కోర్ట్ కి పంపాలి అన్నారు. బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి అని నిష్పక్షపాతంగా విచారణ చేసి న్యాయం జరిగే విధంగా చూడాలి అన్నారు . ముఖ్యంగా గంజాయి ,పేకాట ,గుటక పై ప్రత్యేక నిఘ పెట్టి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు .దొంగతనాలు జరగకుండా పోలీస్ అధికారులు రాత్రిపూట పెట్రోలింగ్ చెయ్యాలి అన్నారు . సైబర్ నేరాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి ఆదేశించారు.