మహిళా పోలీసులతో సమావేశమైన తాళ్లూరు ఎస్సై
తాళ్లూరు లోని పోలీస్ స్టేషన్లో మంగళవారం మహిళా పోలీసులతో ఎస్సై ప్రేమ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మహిళా పోలీసులు తమ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలలో సైబర్ నేరాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.అలాగే శాంతిభద్రతల స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది సైతం పాల్గొన్నారు.
